Dera Baba: డేరా బాబాకు 3,500 మందితో భద్రతా?..

గురుగ్రంథ్‌ సాహిబ్‌ అపవిత్రమైన ఘటన కేసులో నిందితుడు రామ్‌ రహీమ్‌ అలియాస్‌ డేరా బాబాను పంజాబ్‌ తరలించే విషయంపై పంజాబ్‌-హరియాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ బందోబస్తుతో పంజాబ్‌

Published : 07 Jan 2022 07:22 IST

ఆయన ఏమైనా ప్రధానా?

 పంజాబ్‌-హరియాణా హైకోర్టు వ్యాఖ్య

గురుగ్రంథ్‌ సాహిబ్‌ అపవిత్రమైన ఘటన కేసులో నిందితుడు రామ్‌ రహీమ్‌ అలియాస్‌ డేరా బాబాను పంజాబ్‌ తరలించే విషయంపై పంజాబ్‌-హరియాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ బందోబస్తుతో పంజాబ్‌ తీసుకెళ్లేందుకు అతను వీఐపీనో లేక ప్రధానో కాదని వ్యాఖ్యానించింది. హరియాణా రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఉన్న రామ్‌ రహీమ్‌ను 3,500 మంది పోలీసుల భద్రత మధ్య హెలికాప్టర్‌లో పంజాబ్‌కు తరలిస్తామన్న ఆ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ డీఎస్‌ పాట్‌వాలియా వ్యాఖ్యలపై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. విచారణ జరపాల్సి వస్తే జైల్లోనే అతణ్ని కలుసుకోవాలని సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. 

 - ఈటీవీ భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని