
Kerala: ద్రాక్ష గుడ్లు పెడుతున్న కేరళ కోడి
ద్రాక్షపండు సైజులో కోడిగుడ్లు.. ఎప్పుడైనా చూశారా? లేదంటే.. కేరళకు వెళ్లాల్సిందే. మలప్పురంలోని ఏఆర్ నగర్ ప్రాంతానికి చెందిన సమద్ ఇంట్లోని కోడిపెట్ట ద్రాక్షపండ్ల సైజులో గుడ్లు పెడుతోంది. అయిదేళ్ల వయసున్న ఈ కోడిపెట్ట పెడుతున్న గుడ్లలో తెల్లసొన మాత్రమే ఉండి, పచ్చసొన లేకపోవడం మరో విశేషం. కొన్నిరోజుల క్రితం వరకు మామూలు సైజులోనే గుడ్లను పెట్టేదని సమద్ చెప్పారు. ‘మా ఇంట్లో ఉన్న మిగతా కోళ్లకు పెట్టే ఆహారాన్నే ఈ కోడికీ పెడతాం. అయినా ఇలా వింత సైజులో ఇప్పటిదాకా 9 గుడ్లు పెట్టింది’ అని వివరించారు. ఈ చిన్నగుడ్ల ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. వాటిని చూసేందుకు చాలామంది సమద్ ఇంటికి వస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.