Ludo Love Story:పాక్‌ టీనేజర్‌తో భారతీయ వివాహిత ప్రేమ

ఆన్‌లైనులో లూడో గేమ్‌ ద్వారా పరిచయమైన యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేసి దేశ సరిహద్దులు దాటేందుకు సిద్ధమైంది ఓ మహిళ. చివరిక్షణంలో పోలీసులు అడ్డుకోవడంతో కథ అడ్డం తిరిగింది. గురువారం పంజాబ్‌లో

Updated : 07 Jan 2022 08:49 IST

పంజాబ్‌ పోలీసుల అదుపులో వివాహిత

ఆన్‌లైనులో లూడో గేమ్‌ ద్వారా పరిచయమైన యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేసి దేశ సరిహద్దులు దాటేందుకు సిద్ధమైంది ఓ మహిళ. చివరిక్షణంలో పోలీసులు అడ్డుకోవడంతో కథ అడ్డం తిరిగింది. గురువారం పంజాబ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. తరచూ ఆన్‌లైన్‌ లూడోకు అలవాటుపడిన రాజస్థానీ వివాహితకు ఆ ఆటలో పాకిస్థాన్‌కు చెందిన ఓ టీనేజర్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అతనితోనే కలిసి జీవించాలని.. ఇంటినొదిలి పంజాబ్‌కు చేరుకొంది. అమృత్‌సర్‌లో ఉన్న ఆమెకు వాఘా సరిహద్దుకు చేరుకోమని ప్రియుడు సూచించాడు. దీంతో ఆమె ఆటో మాట్లాడుకుంది. ఫలానా చోటుకు తీసుకురమ్మని పాక్‌ యువకుడు ఫోను ద్వారా డ్రైవరుకు సూచనలు చేశాడు. అనుమానం వచ్చిన డ్రైవరు నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళ వద్ద కొంత డబ్బు, నగలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని