TrainTickets: రైలు టికెట్లపై అభివృద్ధి పన్ను భారం

దూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులపై అభివృద్ధి పన్ను భారం పడనుంది. రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్న రైల్వేస్టేషన్లకు ఈ పెంపు వర్తిస్తుంది. స్టేషన్‌ అభివృద్ధి రుసుం (స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీ /ఎస్డీఎఫ్‌) పేరిట ప్రయాణికుల నుంచి టికెట్‌

Updated : 09 Jan 2022 09:16 IST

దిల్లీ: దూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులపై అభివృద్ధి పన్ను భారం పడనుంది. రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్న రైల్వేస్టేషన్లకు ఈ పెంపు వర్తిస్తుంది. స్టేషన్‌ అభివృద్ధి రుసుం (స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీ /ఎస్డీఎఫ్‌) పేరిట ప్రయాణికుల నుంచి టికెట్‌ స్థాయినిబట్టి రూ.10 నుంచి రూ.50 దాకా అదనంగా వసూలు చేయనున్నారు. రైల్వే టికెట్ల బుకింగు సమయంలోనే ఈ అదనపు మొత్తాన్ని కలుపుతారు. ఆయా స్టేషన్ల నవీకరణ పూర్తయ్యాకే ఈ వడ్డింపు ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ అదనపు రుసుం మూడు కేటగిరీలుగా ఉంటుంది. ఏసీ క్లాస్‌ ప్రయాణికులకు రూ.50, స్లీపర్‌ క్లాసుకు రూ.25, అన్‌ రిజర్వుడు క్లాసుకు రూ.10 వసూలు చేస్తారు. సబర్బన్‌ రైలు ప్రయాణాలకు ఈ అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు రైల్వేబోర్డు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని