గెంటేసిన పిల్లలపైగెలిచిన అవ్వ..న్యాయ పోరాటంలో వృద్ధురాలి విజయం

ఆస్తిని తమ పేరిట రాయించుకున్న తన ఇద్దరు కుమారులు, కుమార్తె.. వృద్ధాప్యంలో తనను ఇంట్లోంచి గెంటేశారని ప్రేమవ్వ హావలన్నవర్‌ (76) అనే వృద్ధురాలు....

Updated : 10 Jan 2022 09:24 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ఆస్తిని తమ పేరిట రాయించుకున్న తన ఇద్దరు కుమారులు, కుమార్తె.. వృద్ధాప్యంలో తనను ఇంట్లోంచి గెంటేశారని ప్రేమవ్వ హావలన్నవర్‌ (76) అనే వృద్ధురాలు న్యాయ పోరాటానికి దిగింది. ఆరేళ్ల క్రితం భర్తను కోల్పోయి, ఒంటరిగా మారిన ఆమె సంరక్షణ బాధ్యత తమది కాదంటూ పిల్లలు చేతులెత్తేశారు. కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్‌ తాలూకా వీరపుర గ్రామానికి చెందిన ఆమె జిల్లా కేంద్రంలోని స్వధార్‌ గృహ్‌లో చేరారు. ఈ కేంద్రాన్ని నిర్వహించే పరిమళ్‌ జైన్‌ ఆమె విషయం తెలుసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం.. ఆమెకు నెలకు రూ.10 వేలు చెల్లించాలని ఆమె ఇద్దరు కుమారులకు నోటీసులు జారీ చేసింది. అప్పటికీ వారు స్పందించకపోవడంతో కుమారులిద్దరి పేరిట ఉన్న ఆరెకరాల వ్యవసాయ భూమిని ప్రేమవ్వకు బదిలీ చేయాలని ఆదేశించింది. కొడుకులు గొడవ పడితే, ప్రేమవ్వకు ఆ పొలం మొత్తంపై శాశ్వత హక్కు కలిగేలా ఆదేశిస్తామని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని