Deltacron:‘డెల్టాక్రాన్‌’ పట్ల ఆందోళన అక్కర్లేదు

సైప్రస్‌ దీవిలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘డెల్టాక్రాన్‌’ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సభ్యుడు డా.వినయ్‌ అగర్వాల్‌ చెప్పారు. డెల్టాక్రాన్‌ తీవ్రత గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు.

Updated : 12 Jan 2022 07:30 IST

ఐఎంఏ సభ్యుడు డా.వినయ్‌ అగర్వాల్‌

దిల్లీ: సైప్రస్‌ దీవిలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘డెల్టాక్రాన్‌’ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సభ్యుడు డా.వినయ్‌ అగర్వాల్‌ చెప్పారు. డెల్టాక్రాన్‌ తీవ్రత గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. దేశంలో ఇప్పటికే కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నందున ముప్పు పెద్దగా ఉండకపోవచ్చన్నారు. డెల్టా కారణంగా బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండగా, ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. అయితే- సైప్రస్‌లోని పరిశోధకులు ఈ రెండు రకాల వైరస్‌ల కలయికతో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ను గుర్తించారు! దీన్ని ‘డెల్టాక్రాన్‌’గా పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం దీనికి అధికారికంగా ఎలాంటి పేరూ పెట్టలేదు. ఏషియన్‌ సొసైటీ ఆఫ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ అధ్యక్షుడు డా.తమొరిష్‌ కోల్‌ కూడా డెల్టాక్రాన్‌ ప్రమాదకరమైన వేరియంట్‌ కాకపోవచ్చన్నారు. డబ్ల్యూహెచ్‌వో అసలు దీన్ని ఇప్పటివరకూ గుర్తించనే లేదని, ఈ వేరియంట్‌తో ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని