31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగుస్తాయి. రెండో విడత సమావేశాలు మార్చి

Updated : 15 Jan 2022 10:50 IST

ఈనాడు, దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగుస్తాయి. రెండో విడత సమావేశాలు మార్చి 14న మొదలై ఏప్రిల్‌ 8 వరకు కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ తీవ్రత ఆధారంగా ఇందులో కొంత మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. 31న సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది పదవీకాలం పూర్తికానున్నందున పార్లమెంటులో ఇదే ఆయన చివరి ప్రసంగం కానుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని