రైలు గార్డు.. ఇక రైలు మేనేజర్‌

ఇప్పటివరకు రైలు గార్డుగా ఉన్న హోదాను రైలు మేనేజర్‌గా మారుస్తూ రైల్వే బోర్డు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం

Published : 15 Jan 2022 04:40 IST

ఈనాడు, దిల్లీ: ఇప్పటివరకు రైలు గార్డుగా ఉన్న హోదాను రైలు మేనేజర్‌గా మారుస్తూ రైల్వే బోర్డు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకపై అసిస్టెంట్‌ గార్డు పేరును అసిస్టెంట్‌ ప్యాసింజర్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, గూడ్స్‌గార్డ్‌ పేరును గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, సీనియర్‌ గూడ్స్‌గార్డ్‌ పేరును సీనియర్‌ గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌గా మారుస్తున్నట్లు ఇందులో పేర్కొంది. అయితే హోదా పేరు మార్చినంత మాత్రాన వేతనాలు, భత్యాలు, ఈ పోస్టుల నియామక ప్రక్రియ, బాధ్యతలు, సీనియార్టీ, ప్రమోషన్‌ అవకాశాల్లో మార్పు ఉండదని బోర్డు స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని