సెప్సిస్ సమస్యలకు చెక్!
సెప్సిస్ సంబంధ అనారోగ్య సమస్యలకు సంబంధించి తెల్ల రక్తకణాల పాత్రపై ఐఐటీ-రూర్కీ పరిశోధకులు కొత్త విషయాలను కనుగొన్నారు. ఈ వివరాలను ‘ఇమ్యునాలజి’ పత్రిక అందించింది. రక్తం లేదా
తెల్లరక్తకణాల పాత్రను గుర్తించిన ఐఐటీ-రూర్కీ పరిశోధకులు
దిల్లీ: సెప్సిస్ సంబంధ అనారోగ్య సమస్యలకు సంబంధించి తెల్ల రక్తకణాల పాత్రపై ఐఐటీ-రూర్కీ పరిశోధకులు కొత్త విషయాలను కనుగొన్నారు. ఈ వివరాలను ‘ఇమ్యునాలజి’ పత్రిక అందించింది. రక్తం లేదా శరీర కణజాలంలోకి హానికర సూక్ష్మజీవులు వృద్ధిచెందేటప్పుడు... వాటికి వ్యతిరేకంగా శరీరం ప్రతిస్పందిస్తుంది. ఆ సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యను సెప్సిస్గా పేర్కొంటారు. దీని కారణంగా ఒక్కోసారి అవయవాలు పాడవుతాయి. సెప్సిస్ బాధితుల్లో... గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకునే వేగం పెరగడం, చర్మంపై దద్దుర్లు, మూత్రం స్తంభించడం లేదా సరిగా రాకపోవడం, ఒళ్లు నొప్పులు, విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ సమస్యపై ఐఐటీ పరిశోధకులు దృష్టి సారించారు. ‘‘న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, మాక్రోఫేజ్ అనే తెల్లరక్త కణాలు... బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను, మృతకణాలను గుర్తిస్తాయి. శరీరంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు... ఈ తెల్లరక్త కణాలు అక్కడికి పెద్ద సంఖ్యలో వెళ్లి మోహరిస్తాయి. అయితే, వీటి ప్రయాణానికి ‘ఇంటెగ్రిన్స్’ అనే రిసెప్టర్ మాలిక్యుల్స్ దోహదపడతాయి. వీటి ఉనికిని గమనించడం ద్వారా సెప్సిస్ తీవ్రతను తెలుసుకుని, చికిత్స అందించే వీలుంది’’ అని పరిశోధనకర్త ప్రణీత సారంగి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్