కేంద్ర నిర్ణయం దిగ్భ్రాంతికరం

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో పశ్చిమబెంగాల్‌ సర్కారు ప్రతిపాదించిన శకటాన్ని తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దిగ్భ్రాంతి కలిగించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చర్యతో రాష్ట్ర

Published : 17 Jan 2022 04:39 IST

పశ్చిమబెంగాల్‌ శకటాన్ని తిరస్కరించడంపై సీఎం మమత
పునరాలోచించాలంటూ ప్రధాని మోదీకి లేఖ

కోల్‌కతా: దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో పశ్చిమబెంగాల్‌ సర్కారు ప్రతిపాదించిన శకటాన్ని తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దిగ్భ్రాంతి కలిగించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చర్యతో రాష్ట్ర ప్రజలు సైతం ఆవేదనకు గురయ్యారని.. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీకి మమత లేఖ రాశారు. ఎలాంటి కారణం చూపకుండానే రాష్ట్ర శకటాన్ని తిరస్కరించడం సరైంది కాదన్నారు. నేతాచ్కీజీజి సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ఆయనను, ఆయన నేతృత్వంలోని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని గుర్తు చేసుకునేలా ఈ శకటాన్ని రూపొందించామని మమత ఈ సందర్భంగా పేర్కొన్నారు. శకటాన్ని తిరస్కరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారన్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా బెంగాల్‌ శకటానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని