
Published : 17 Jan 2022 04:40 IST
పోలీసు జోక్యంతో కశ్మీర్ ప్రెస్‌క్లబ్‌కు తాళం
తప్పుబట్టిన ఎడిటర్స్ గిల్డ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రెస్‌క్లబ్‌లో శని, ఆదివారాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ సభ్యుడికి కొవిడ్ సోకిందన్న కారణం చూపి.. ఆదివారం పోలీసు రక్షణతో వచ్చిన కొత్త పాలకవర్గం ప్రెస్‌క్లబ్‌కు తాళం వేయడం వివాదాస్పదంగా మారింది. ఈ చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాతోపాటు పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇది జమ్మూకశ్మీర్ పాలకవర్గ కుట్ర అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎడిటర్స్ గిల్డ్ కేంద్ర పాలిత ప్రాంతంలో పోలీసు సాయంతో మీడియా అణచివేత కొనసాగుతోందని చెప్పేందుకు ఇది నిదర్శనమని పేర్కొంది. ప్రెస్‌క్లబ్ కార్యాలయాన్ని, పాలకపీఠాన్ని జర్నలిస్టుల్లోని ఓ వర్గం పోలీసు సాయంతో శనివారం చేజిక్కించుకోవడం దారుణమని తెలిపింది.
Tags :