
Published : 17 Jan 2022 04:43 IST
చక్రాలకుర్చీతో దివ్యాంగుడి రికార్డు
భువనేశ్వర్ అర్బన్, న్యూస్‌టుడే: ఒడిశాలోని పూరీకి చెందిన దివ్యాంగుడు కమలాకాంత్ (27) ట్రై సైకిల్ నడపడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. భువనేశ్వర్‌లో శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా 20 గంటలపాటు 183 కి.మీ సైకిల్ నడిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సైకిల్ నడపడం ప్రారంభించి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ముగించారు. దీన్ని వీడియో తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థకు పంపడంతో వారు పరిశీలించి ఆమోదించారని కమలాకాంత్ తెలిపారు.
Tags :