గణతంత్ర వేడుకల్లో 75 విమానాలతో విన్యాసాలు

దేశ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వాయుసేన ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా.. 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో

Published : 18 Jan 2022 05:20 IST

దిల్లీ: దేశ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వాయుసేన ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా.. 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో విన్యాసాలు చేపట్టనున్నట్లు వాయుసేన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. విన్యాసాల్లో రఫేల్‌, జాగ్వార్‌, మిగ్‌-29 యుద్ధ విమానాలు, చినూక్‌ హెలికాప్టర్‌లు పాల్గొంటాయని వాయుసేన అధికారులు తెలిపారు. ఎంఐ 17 హెలికాప్టర్‌ల ‘ధ్వజ్‌’ ఆకృతితో విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నాలుగు తేలికపాటి హెలికాప్టర్లతో ‘రుద్ర’, ఐదు హెలికాప్టర్లతో ‘రాహత్‌’ విన్యాసాలు ఉంటాయని ఓ అధికారి వెల్లడించారు. అదేవిధంగా ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు కూడా విన్యాసాల్లో పాలుపంచుకుంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని