Published : 18 Jan 2022 05:20 IST

పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి కన్నుమూత

అనాథలకు తల్లిగా, సమాజ సేవకురాలిగా గుర్తింపు

గుణుపురం, న్యూస్‌టుడే: పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి (88) ఆదివారం రాత్రి గుండెపోటుతో స్వగృహంలో కన్నుమూశారు. 1934లో ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జన్మించిన శాంతిదేవి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. 1951లో రతన్‌దాస్‌ను వివాహం చేసుకున్నారు. ఆ ఏడాదే అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో తీవ్రమైన కరవు రావడంతో బాధితులకు అండగా నిలవాలని భర్తతో అక్కడికి చేరుకుని సేవలందించారు. ఈ సమయంలోనే వినోబాభావే భూదాన్‌ ఉద్యమంలో భాగమయ్యారు. పెత్తందార్ల చేతిలో ఉన్న భూములను పేదలకు పంచడం, కుష్ఠు రోగులకు సేవ చేయడం, గిరిజన బాలికలకు చదువు చెప్పడం, అనాథ బాలికలను చేరదీసి వసతి కల్పించి ప్రయోజకులను చేయడం చేసేవారు. రాయగడ జిల్లాలోని గుణుపురంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న శాంతిదేవి సేవాసమాజ్‌ పేరిట ఆశ్రమాలు నెలకొల్పి వందలాది అనాథ బాలికలు, మహిళల భవిష్యత్తును తీర్చిదిద్దారు.  శాంతిదేవి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2021 నవంబరులో పద్మశ్రీతో సత్కరించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్