Metaverse: ‘మెటావర్స్‌’లో రిసెప్షన్‌.. కాబోయే జంట వినూత్న ప్రయత్నం

తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌గా పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు దినేష్‌ క్షత్రియన్‌కు జనగనందిని అనే యువతితో ఫిబ్రవరిలో ఓ గ్రామంలో వివాహం జరగనుంది. రిసెప్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా

Updated : 18 Jan 2022 08:42 IST

ఈనాడు, చెన్నై: తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌గా పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు దినేష్‌ క్షత్రియన్‌కు జనగనందిని అనే యువతితో ఫిబ్రవరిలో ఓ గ్రామంలో వివాహం జరగనుంది. రిసెప్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బంధువులు, మిత్రులు ‘మెటావర్స్‌’ అనే వర్చువల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లో హాజరయ్యేలా నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ జంట ఈ మధ్యే తమ ‘అవతార్‌’ల ద్వారా కలుసుకున్న రిహార్సల్‌ వీడియోను దినేష్‌ సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఇది ఇప్పుడు వైరల్‌ అవుతోంది. తాను బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో పనిచేస్తున్నానని, మెటావర్స్‌కు అదే మూలం కావడంతో ఆ పద్ధతిలోనే రిసెప్షన్‌ పెట్టాలనుకున్నప్పుడు తనకు కాబోయే భార్య కూడా అందుకు అంగీకరించిందన్నారు. మెటావర్స్‌ పద్ధతిలో యూజర్లంతా వర్చువల్‌గా కలుసుకుని, డిజిటల్‌ అవతార్‌లతో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు. మెటావర్స్‌లో ఆగ్మెంటెడ్‌ రియాల్టీ, బ్లాక్‌చైన్‌, వర్చువల్‌ రియాల్టీ కలగలిసి ఉంటాయి. ఈ రంగంలోని ఒక అంకుర సంస్థతో కలిసి దేశంలోనే తొలిసారిగా మెటావర్స్‌ పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విటర్‌ ద్వారా దినేష్‌ ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని