కుష్టు వ్యాధి పీడితులపై వివక్షను రూపుమాపాలి

కుష్టువ్యాధి పీడిత వ్యక్తులపై వివక్షను చూపే చట్టాలను తొలగించాలని కేంద్ర, రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) లేఖ రాసింది. ఇందుకు సంబంధించి 97 చట్టాల జాబితాను రూపొందించింది.

Published : 18 Jan 2022 05:20 IST

కేంద్ర, రాష్ట్రాలకు జాతీయ మానవహక్కుల కమిషన్‌ సూచన

దిల్లీ: కుష్టువ్యాధి పీడిత వ్యక్తులపై వివక్షను చూపే చట్టాలను తొలగించాలని కేంద్ర, రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) లేఖ రాసింది. ఇందుకు సంబంధించి 97 చట్టాల జాబితాను రూపొందించింది. కుష్టురోగులపై వివక్ష చూపే అవమానకరమైన నిబంధనలు ఈ చట్టాల్లో ఉన్నాయని పేర్కొంది. వీటిని తొలగించేందుకు కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని విశ్రాంత న్యాయమూర్తి అరుణ్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారిని సకాలంలో గుర్తించి, చికిత్స చేయాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం భారీగా ప్రచారం చేయాలని కోరింది. ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, విద్య, భూమి హక్కులు లేదా ఏ ఇతర హక్కు విషయంలోనూ కుష్టువ్యాధి పీడిత వ్యక్తి లేదా అతని కుటుంబసభ్యులు వివక్షకు గురికాకుండా చూడాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని