
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు పోలీసుల అరెస్టు
బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై నివాసానికి సమీపంలో గంజాయి విక్రయిస్తున్న శివకుమార్, సంతోష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను బెంగళూరు ఆర్టీ నగర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కోరమంగల ఠాణాలో పనిచేస్తున్న వీరిని ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రత కోసం నియమించారు. తొలుత టోకుగా గంజాయి విక్రయిస్తున్న అఖిల్ రాజ్, అమ్జాద్ ఖాన్ అనే ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి కొనుగోలు చేసుకుంటున్న వారిలో పోలీసులు ఉండడంతో కంగుతిన్నారు. ఆహారాన్ని, కొరియర్లను సరఫరా చేసే యువకుల ద్వారా కానిస్టేబుళ్లు ఇద్దరూ గంజాయిని తెప్పించుకుని, చిన్న పొట్లాలుగా కట్టి చిల్లరగా విక్రయించే వారని గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.