ఉగ్రవాదులకు దేశం నుంచే ఆయుధాలు..

పాకిస్థాన్‌ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశంలోని కీలక వ్యక్తుల కోసం జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఏ) వేట ముమ్మరం చేసింది. దీంతో సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది.

Published : 19 Jan 2022 04:31 IST

సరఫరా చేసే వారి కోసం గాలింపు: ఎన్‌ఐఏ

పాకిస్థాన్‌ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశంలోని కీలక వ్యక్తుల కోసం జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఏ) వేట ముమ్మరం చేసింది. దీంతో సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. నిందితులను పట్టుకునేందుకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌ఐఏ అధికారి ‘ఈటీవీ భారత్‌’తో తెలిపారు. బిహార్‌ నుంచి జమ్మూ- కశ్మీర్‌కు ఆయుధాలు తరలించేందుకు కుట్ర పన్నిన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం.. సోదాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఈ నలుగురు నిందితులను మహమ్మద్‌ అర్మాన్‌ అలీ అలియాస్‌ అర్మాన్‌ మన్సూరీ, మహమ్మద్‌ ఎహసానుల్లా అలియాస్‌ గుడ్డు, ఇమ్రాన్‌ అహ్మద్‌ హజామ్‌, ఇర్ఫాన్‌ అహ్మద్‌ దార్‌లుగా గుర్తించారు. పంజాబ్‌, హరియాణా మీదుగా ఆయుధాలను తరలించాలని వీరు ప్రయత్నించారని.. పాక్‌ ప్రోద్బలంతో పనిచేసే ఉగ్రసంస్థల కోసం వీటిని తీసుకెళ్తున్నారని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని