టీకా ప్రభావాలపై గర్భిణులకు అవగాహన కల్పించాం

కొవిడ్‌ టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తలెత్తే అవకాశమున్న దుష్పరిణామాల గురించి గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అవగాహన కల్పించామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ఈ విషయంలో గత ఏడాది జులై 2న ప్రామాణిక

Published : 19 Jan 2022 04:31 IST

సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రం ప్రమాణపత్రం

దిల్లీ: కొవిడ్‌ టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తలెత్తే అవకాశమున్న దుష్పరిణామాల గురించి గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అవగాహన కల్పించామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ఈ విషయంలో గత ఏడాది జులై 2న ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్‌వోపీ), మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం ఈ మేరకు ప్రమాణపత్రం (అఫిడవిట్‌) సమర్పించింది. గర్భధారణ సమయంలో కొవిడ్‌ మహమ్మారి బారిన పడితే ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందో కూడా మహిళలకు తెలియజేస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని