
ఆ అక్కాచెల్లెళ్లకు జీవిత ఖైదు
పిల్లలను అపహరించి చంపిన కేసులో బొంబాయి హైకోర్టు తీర్పు
ముంబయి: పిల్లలను అపహరించి వారి ప్రాణాలు తీసిన కేసులో అక్కాచెల్లెళ్లు రేణుకా శిందే, సీమా గవిత్లకు కొల్హాపుర్ న్యాయస్థానం విధించిన మరణ శిక్షను బొంబాయి హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 1990-1996 మధ్య కాలంలో దాదాపు 14 మంది పిల్లలను వీరు అపహరించారు. వీరిలో అయిదుగురు పిల్లల ప్రాణాలు తీశారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్ న్యాయస్థానం వీరిద్దరిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. మంగళవారం ఈ కేసు విచారణ జరిపిన బొంబాయి హైకోర్టు ఈ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మరణశిక్షను అమలు చేయడంలో విపరీతమైన జాప్యం చేశాయని న్యాయమూర్తులు జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ ఎస్వీ కొత్వాల్లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరణశిక్షను 2006లో సుప్రీం కోర్టు సైతం సమర్థించిందని గుర్తు చేసింది. 2014లో రాష్ట్రపతి కూడా వారి క్షమాభిక్ష పిటిషన్ను రద్దు చేసినా.. శిక్ష అమలులో జాప్యం చేశారని హైకోర్టు పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.