ఆ యాప్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి

క్లబ్‌హౌస్‌ యాప్‌లో ‘ముస్లిం మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కొంతమంది వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దిల్లీ మహిళా కమిషన్‌(డీసీడబ్ల్యూ) పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలో ముస్లిం మహిళలు, బాలికల గురించి

Published : 19 Jan 2022 04:34 IST

పోలీసులను కోరిన దిల్లీ మహిళా కమిషన్‌

దిల్లీ: క్లబ్‌హౌస్‌ యాప్‌లో ‘ముస్లిం మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కొంతమంది వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దిల్లీ మహిళా కమిషన్‌(డీసీడబ్ల్యూ) పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలో ముస్లిం మహిళలు, బాలికల గురించి అవమానకర రీతిలో ప్రస్తావించారని డీసీడబ్ల్యూ తెలిపింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన కమిషన్‌ ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేయాలని ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించేందుకు అయిదు రోజుల గడువు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని