మా రాష్ట్రంలో టెస్లా ప్లాంటు పెట్టండి
భారత విద్యుత్తు వాహన (ఈవీ) హబ్‌గా పేరొందిన కర్ణాటకలో టెస్లా ప్లాంటును స్థాపించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి మురుగేశ్ నిరాణి ఆ సంస్థ యాజమాన్యానికి విన్నవించారు. బెంగళూరు పరిసరాల్లో విద్యుత్తు
సంస్థ యాజమాన్యానికి కర్ణాటక వినతి
ఈనాడు డిజిటల్, బెంగళూరు: భారత విద్యుత్తు వాహన (ఈవీ) హబ్‌గా పేరొందిన కర్ణాటకలో టెస్లా ప్లాంటును స్థాపించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి మురుగేశ్ నిరాణి ఆ సంస్థ యాజమాన్యానికి విన్నవించారు. బెంగళూరు పరిసరాల్లో విద్యుత్తు వాహన రంగానికి చెందిన 400 పరిశోధన అభివృద్ధి కేంద్రాలు, 45కు పైగా అంకురాలు, క్లస్టర్లు ఉన్నాయి. భారతీయ ఈవీ గమ్యస్థానంగా ఉన్న బెంగళూరు టెస్లా ప్లాంటుకు అనువైన చోటని మంత్రి వివరించారు. టెస్లా కార్ల తయారీ కోసం బెంగళూరులో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆర్ఓసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్)ని నమోదు చేసుకున్నట్లు మంత్రి గుర్తుచేశారు. కర్ణాటక రాష్ట్ర సర్కారు ఈవీ సంస్థలకు ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటించినట్లు వివరించారు. భారత్‌లో టెస్లా ప్లాంటు ఏర్పాటు సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ ఇటీవల ట్వీట్ చేశారు. భారత వాహన మార్కెట్లో అడుగుపెట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు టెస్లా ప్లాంటు స్థాపన కోసం ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సైతం ఆ జాబితాలో చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!