
ఆరడుగుల కొండచిలువను మింగేసిన కింగ్ కోబ్రా
కటక్, న్యూస్‌టుడే: ఆరడుగుల కొండచిలువను మింగేసి కదల్లేని స్థితిలో ఉన్న 11 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులు పట్టుకున్నారు. ఒడిశాలోని అనుగుల్ జిల్లా సతకోసియా అభయారణ్యానికి సమీపంలోని కరడపడ గ్రామంలో దశ బెహరా అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం కింగ్‌కోబ్రా కంటపడింది. స్నేక్ హెల్ప్‌లైన్ ప్రతినిధులకు సమాచారం అందించగా, ఇంటి వద్దకు చేరుకొని కింగ్‌కోబ్రాను పట్టుకున్నారు. ఏదో పొడవైనది మింగడంతో కదల్లేకపోతోందని భావించి, పాము పొట్టలో ఉన్నది కక్కేలా చేశారు. దాంతో దాని నోటి నుంచి మృతి చెందిన 6 అడుగుల కొండచిలువ బయటపడింది. అనంతరం కింగ్‌కోబ్రాను సమీపంలోని అడవిలో విడిచి పెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.