ఐఏఎస్‌ అధికారుల డిప్యూటేషన్‌ నిబంధనల్లో మార్పులు!

డిప్యూటేషన్‌ కింద కేంద్రంలో సేవలు అందించడానికి సరిపడా ఐఏఎస్‌ అధికారులు అందుబాటులో ఉండేలా చూడటానికి సర్వీసు నిబంధనలను సడలించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. ఇవి అమల్లోకి వస్తే డిప్యూటేషన్‌

Published : 19 Jan 2022 04:37 IST

కొత్త ప్రతిపాదనలు తెచ్చిన కేంద్రం
వ్యతిరేకించిన మమతా బెనర్జీ

దిల్లీ: డిప్యూటేషన్‌ కింద కేంద్రంలో సేవలు అందించడానికి సరిపడా ఐఏఎస్‌ అధికారులు అందుబాటులో ఉండేలా చూడటానికి సర్వీసు నిబంధనలను సడలించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. ఇవి అమల్లోకి వస్తే డిప్యూటేషన్‌ అంశంలో కేంద్ర నిర్ణయాధికార పరిధి పెరుగుతుంది.

రాష్ట్ర/ఉమ్మడి క్యాడర్‌ నుంచి సరిపడా సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులను డిప్యూటేషన్‌ కింద పంపడం లేదని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. దీనిపై అనేకమార్లు ప్రస్తావించినప్పటికీ పరిస్థితి మారలేదని, అందువల్ల తాజా ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్లు పేర్కొంది. వీటి ప్రకారం.. వివిధ స్థాయుల్లో అర్హులైన ఐఏఎస్‌ అధికారులను నిర్దిష్ట సంఖ్యలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. రాష్ట్రం వద్ద అందుబాటులో ఉన్న అధికారుల సంఖ్యకు అనుగుణంగా ఇది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సేవల్లోకి పంపాల్సిన అధికారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, కేంద్ర సర్కారే ఖరారు చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్రానికి అభ్యంతరం ఉన్నప్పటికీ అంతిమంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలావధిలోగా దీన్ని అమలు చేయాలి.
నిబంధనల్లో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం గత ఏడాది డిసెంబరు 20న అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపింది. జనవరి 5లోగా వీటిపై స్పందన తెలియజేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. వీటివల్ల రాష్ట్రాల్లో పాలన కుంటుపడుతుందని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని