24 ఏళ్లుగా కొబ్బరే ఆహారం..

కేరళలో ఓ వ్యక్తి 24 ఏళ్లుగా అన్నం తినకుండా.. కేవలం లేత కొబ్బరి తిని ఆరోగ్యంగా ఉంటున్నారు. 63 ఏళ్ల వయసులోనూ పోలీసు ఉద్యోగార్థులకు కఠిన వ్యాయామాలు చేయిస్తూ శిక్షణ ఇస్తున్నారు. కాసర్‌గడ్‌కు చెందిన బాలక్రిష్ణన్‌ పాలై మొదట్లో కేరళ

Published : 19 Jan 2022 04:40 IST

కేరళలో ఓ వ్యక్తి 24 ఏళ్లుగా అన్నం తినకుండా.. కేవలం లేత కొబ్బరి తిని ఆరోగ్యంగా ఉంటున్నారు. 63 ఏళ్ల వయసులోనూ పోలీసు ఉద్యోగార్థులకు కఠిన వ్యాయామాలు చేయిస్తూ శిక్షణ ఇస్తున్నారు. కాసర్‌గడ్‌కు చెందిన బాలక్రిష్ణన్‌ పాలై మొదట్లో కేరళ పోలీసు విభాగంలో, తర్వాత కొంతకాలం.. రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసే సమయంలో బాలక్రిష్ణన్‌ వివిధ రకాల వంటకాలను ఇష్టంగా తినేవారు. కానీ ఓ రోజు ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురికావడంతో ఆయన అన్నవాహికకు అరుదైన వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి బాలక్రిష్ణన్‌ జీర్ణవ్యవస్థ క్రమంగా నెమ్మదించింది. ఇలా తిన్న ప్రతిసారి అస్వస్థతకు గురయ్యేవారు. అన్నం తినడం క్రమంగా తగ్గిస్తూ వచ్చిన బాలక్రిష్ణన్‌  లేత కొబ్బరిని తినడం ప్రారంభించారు. అలా 24 ఏళ్లుగా కొబ్బరి తప్ప మరేది తినకుండా జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజూ రెండు కొబ్బరి బొండాలను కొనుగోలు చేసి వాటినే ఆహారంగా తీసుకుంటానని బాలక్రిష్ణన్‌ పాలై తెలిపారు. అప్పటి నుంచి ఏనాడు అనారోగ్యం బారిన పడలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లోనూ రాణిస్తున్నారు. 2010లో  మలేసియాలో జరిగిన మాస్టర్స్‌ మీట్‌లో లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌లోనూ పతకాలు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని