
4 కాళ్లు, 4 చేతులతో శిశువు జననం!
బిహార్‌లోని కతిహార్ జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఓ మహిళ.. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నట్లు కనిపిస్తున్న శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును చూసేందుకు ఆసుపత్రికి జనం భారీగా తరలి వెళ్తున్నారు. హఫ్లగంజ్ గ్రామానికి చెందిన రాజు సాహ్ తన భార్యను ప్రసవం కోసం సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయని వైద్య సిబ్బంది చెప్పడంతో కుటుంబసభ్యులు ఆవేదనకు గురయ్యారు. దీంతో ప్రైవేటు క్లినిక్ వైద్యులపై బంధువులు ఆరోపణలు చేశారు. గతంలో స్కానింగ్ తీసినప్పుడు దీని గురించి ఎలాంటి విషయాలు చెప్పలేదని పేర్కొన్నారు. మరోవైపు.. ఇదేం వింత శిశువు కాదని.. దివ్యాంగులుగా పిలుస్తారని సదర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది చెప్పారు. ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీసిన వైద్యులు.. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.