
యువత జాతీయ సమర స్మారకాన్ని సందర్శించాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఈనాడు, దిల్లీ: దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారికి గుర్తుగా నిర్మించిన జాతీయ సమర స్మారక కేంద్రాన్ని యువత సందర్శించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన యుద్ధవీరుల స్మారక కార్యక్రమంలో పాల్గొని ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ కేంద్రాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్న తరుణంలో ఈ జాతీయ సమర స్మారక కేంద్రాన్ని అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తప్పకుండా సందర్శించాలని కేంద్ర మంత్రి సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.