Published : 19 Jan 2022 04:43 IST

సీఎం చన్నీ బంధువు ఇంట్లో ఈడీ సోదాలు

దిల్లీ/చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్న కంపెనీల మీద, అక్రమ ధనాన్ని సక్రమ ధనంగా చలామణి చేస్తున్న ఇసుక మాఫియాపై ఈడీ పలు చోట్ల దాడులు నిర్వహించింది.  ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ మేనల్లుడు భూపిందర్‌ సింగ్‌ నివాసంలోనూ తనిఖీలు చేశారు. చండీగఢ్‌, మొహాలీ, లూథియానా, పఠాన్‌ కోట్‌లతో సహా మొత్తం 12 చోట్ల ఈడీ సోదాలు జరిపింది.

రూ.6 కోట్ల నగదు స్వాధీనం

అక్రమ ఇసుక తవ్వకాలపై జరిపిన దాడుల్లో పంజాబ్‌ సీఎం మేనల్లుడికి సంబంధించిన నివాసంలో రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

కేంద్రమే ఈడీని ఉసిగొల్పింది: చరణ్‌జీత్‌  

మరోవైపు.. పంజాబ్‌లో తన మీద, కాంగ్రెస్‌ మంత్రులు, సభ్యుల మీద ఒత్తిడి పెంచడానికి కేంద్రం ఈడీని ఉసిగొల్పిందని సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే విధంగా మమతా బెనర్జీ సంబంధీకుల మీద ఈడీ దాడులు జరిగాయని గుర్తుచేశారు. తనకు ఇసుక, అక్రమ ధన కేసులతో ఏ సంబంధమూ లేదనీ, ఈడీ ఒత్తిడికి తాను తలొగ్గబోనని చన్నీ స్పష్టం చేశారు. చన్నీ దగ్గరి బంధువు భూపిందర్‌ సింగ్‌ ఉరఫ్‌ హనీ మీద ఈడీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని