
కాశీ ప్రజల ప్రేమాభిమానాలు అనూహ్యం: మోదీ
వారణాసి: పవిత్ర నగరమైన వారణాసిలో పుట్టే అదృష్టం తనకు లేకపోయినా పరమ శివుని ఆశీస్సులతో ఇక్కడి ప్రజలకు సేవ చేస్తూ తరిస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన నియోజకవర్గ భాజపా కార్యకర్తలతో మంగళవారం ఆయన ‘నమో యాప్’ ద్వారా ముచ్చటించారు. ఇక్కడి ఎంపీగా తనను ఎన్నుకుని ప్రజలు అనూహ్య ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారని మోదీ చెప్పారు. వారసత్వ నగర సంస్కృతిని పరిరక్షిస్తూనే సత్వర అభివృద్ధి పనులు జరిగేలా చూస్తున్నామని చెప్పారు.
ఎన్నికలు.. పార్టీలకు పరీక్ష
‘‘రాజకీయ పార్టీలకు ఎన్నికలు ఒక పరీక్ష. కార్యకర్తలు అభివృద్ధి చెందడానికి ఇదొక శిక్షణ శిబిరం. ఎన్నికల్లో గెలవడం, పార్టీని విస్తరించడం, కార్యకర్తల అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రతి ఒక్క ఓటుకు ఉన్న శక్తి గురించి ప్రజలకు చెప్పాలి. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినవారిని అందరం స్మరించుకోవాలి’’ అని ప్రధాని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.