
Corona Virus:డెల్టా, ఒమిక్రాన్ ఏదైనా మాస్క్ తీయ.. తగ్గేదేలే
ముంబయి: ‘పుష్ప.. పుష్పరాజ్ ఇక్కడ. తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ చిత్రంలో కథానాయకుడు అల్లు అర్జున్ తనదైన శైలిలో చెప్పే డైలాగు జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయింది. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాను అదే పేరుతో హిందీలో కూడా విడుదల చేశారు. ‘పుష్ప, పుష్పరాజ్.. మై ఝుకూంగా నహీ’ అంటూ ఇందులో ఉన్న పాపులర్ డైలాగును ‘డెల్టా హో యా ఒమిక్రాన్.. మై మాస్క్ ఉతారేగా నహీ’ (డెల్టా అయినా ఒమిక్రానైనా.. నేను మాస్కు తీసేదే లేదు) అంటూ మార్చిన ఓ సరదా మీమ్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ బుధవారం తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. అల్లు అర్జున్ మాస్కు పెట్టుకొన్నట్టుగా ఉన్న ఈ మీమ్‌ను కొవిడ్-19పై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, మాస్కులు పెట్టుకునేలా ప్రోత్సహించే ఉద్దేశంతో రూపొందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.