ఇంటి మిద్దెపై ద్రాక్ష తోట..

ఇంటి మిద్దెపై కూరగాయలు, పూల మొక్కలు పెంచటం చూశాం. కానీ ఓ రైతు ఏకంగా ద్రాక్ష తోటనే పెంచి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ రకంగా మిద్దె సాగును మరో అంచెకు తీసుకెళ్లారు. ఆయనే

Published : 20 Jan 2022 05:05 IST

ఇంటి మిద్దెపై కూరగాయలు, పూల మొక్కలు పెంచటం చూశాం. కానీ ఓ రైతు ఏకంగా ద్రాక్ష తోటనే పెంచి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ రకంగా మిద్దె సాగును మరో అంచెకు తీసుకెళ్లారు. ఆయనే మహారాష్ట్రలోని పుణెకు చెందిన బాహుసాహెబ్‌ కాంచన్‌. కింద ఉన్న మట్టిలో ద్రాక్ష మొక్కలను నాటి.. వాటి తీగలను రెండో అంతస్తు పైకి పాకేలా చేశారు. మిద్దెపైన కర్రలు, ఐరన్‌ రాడ్‌లతో ఊతమిచ్చి ద్రాక్ష తోటను పెంచారు. పక్షులు, ఇతర జంతువుల బెడద లేకుండా చుట్టూ తెరలు అమర్చారు. 2013లో ఐరోపా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ప్రాంతాల్లో మిద్దెలపై ద్రాక్ష, ఇతర పండ్ల తోటలను పెంచటం చూసి స్ఫూర్తి పొందానని బాహుసాహెబ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని