కరోనా మూడో దశ వ్యాప్తి... వలస కార్మికుల సంక్షేమంపై పిటిషన్‌

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ప్రారంభమైన కరోనా మూడో దశ వ్యాప్తిలో వలస కార్మికులకు ఆహారం అందించడం, ఇతర సంక్షేమ చర్యల అమలు కోసం దాఖలైన పిటిషన్‌ను విచారణకు చేపట్టే అంశాన్ని

Published : 20 Jan 2022 05:21 IST

విచారణకు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామన్న సీజేఐ

దిల్లీ: ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ప్రారంభమైన కరోనా మూడో దశ వ్యాప్తిలో వలస కార్మికులకు ఆహారం అందించడం, ఇతర సంక్షేమ చర్యల అమలు కోసం దాఖలైన పిటిషన్‌ను విచారణకు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్‌, హర్ష్‌ మందర్‌, జగదీప్‌ చోకర్‌ దాఖలుచేసిన ఈ మధ్యంతర పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆ ముగ్గురి తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ విజ్ఞప్తి చేశారు. విచారణ వ్యాజ్యాల జాబితాలో ఈ పిటిషన్‌ను చేర్చడంపై పరిశీలించి నిర్ణయిస్తానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని