
Published : 21 Jan 2022 06:23 IST
కరోనా సోకిందని.. పోటీ నుంచి విరమణ!
నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌతమ్‌బుద్ధనగర్ జిల్లాలోని జేవర్ నియోజవర్గం నుంచి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవతార్ సింగ్ భడానా కరోనా సోకడంతో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని గురువారం ఉదయం ప్రకటించారు. వెంటనే స్పందించిన పార్టీ.. ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తామని తెలిపింది. అంతలోనే మనసు మార్చుకున్న భడానా తానే పోటీలో కొనసాగుతానని గురువారం రాత్రి వెల్లడించారు.
Tags :