
Published : 21 Jan 2022 05:02 IST
పీసీబీ అనుమతి లేకుండా క్యారీబ్యాగ్ల తయారీ వద్దు: కేంద్రం
ఈనాడు, దిల్లీ: రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ల రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరూ క్యారీ బ్యాగ్లు, రీసైకిల్డ్ ప్లాస్టిక్, మల్టీ లేయర్డ్ ప్యాకేజింగ్ వస్తువులు ఉత్పత్తి చేయకూడదని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ గురువారం రాత్రి ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ కొత్త నిబంధనలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోపు తమకు సూచనలు, సలహాలు పంపవచ్చని తెలిపింది.
Tags :