దుల్కర్‌ సల్మాన్‌కు కొవిడ్‌

సినీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (35) కొవిడ్‌ బారిన పడ్డారు. తనకు స్వల్ప లక్షణాలున్నట్లు ఆయన గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. తాను ఇంటివద్ద ఐసొలేషన్‌లో ఉన్నానని, కొద్ది రోజులుగా తనను

Published : 21 Jan 2022 06:14 IST

ముంబయి: సినీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (35) కొవిడ్‌ బారిన పడ్డారు. తనకు స్వల్ప లక్షణాలున్నట్లు ఆయన గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. తాను ఇంటివద్ద ఐసొలేషన్‌లో ఉన్నానని, కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా ఐసొలేషన్‌లోకి వెళ్లాలని, లక్షణాలను గుర్తిస్తే పరీక్ష చేయించుకోవాలని కోరారు. కాగా కొద్ది రోజుల క్రితమే ఆయన తండ్రి, ప్రముఖ నటుడు మమ్ముట్టికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని