దుస్తుల అద్దకం పరిశ్రమలో అగ్నిప్రమాదం..

గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా బార్దోలి పట్టణానికి సమీపంలోని దుస్తుల అద్దకం పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురి ప్రాణాలు బలి తీసుకొంది. మూడంతస్తుల భవనం నుంచి 10 మంది

Published : 21 Jan 2022 06:14 IST

ముగ్గురు కార్మికుల సజీవదహనం

బార్దోలి: గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా బార్దోలి పట్టణానికి సమీపంలోని దుస్తుల అద్దకం పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురి ప్రాణాలు బలి తీసుకొంది. మూడంతస్తుల భవనం నుంచి 10 మంది కార్మికులను కాపాడారు. వడ్రంగి పని కోసం మిల్లు యజమాని తీసుకువచ్చిన ముగ్గురు కార్మికుల కాలిన మృతదేహాలను మొదటి అంతస్తులో గుర్తించినట్లు బార్దోలి చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పి.బి.గాధ్వి తెలిపారు. పని ముగించుకొని అక్కడే పడుకొన్న ఈ ముగ్గురూ గాఢనిద్రలో ఉండి, చుట్టూ చెలరేగిన మంటల నుంచి తప్పించుకోలేకపోయారు. వందమంది అగ్నిమాపక సిబ్బంది పదిహేను యంత్రాలతో 12 గంటలు శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయి. భవనం మొత్తం కాలిపోయింది. నిండా మండే రసాయనాలు, దుస్తుల రంగులు, దారపు ఉండలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్దమొత్తంలో రెడీమేడ్‌ దుస్తులు దగ్ధమైనట్లు గాధ్వి తెలిపారు. షార్ట్‌ సర్క్యూటుకు సిలిండర్లు పేలి, అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని