ఇండో-పాక్‌ సరిహద్దులో జారవిడిచిన హెరాయిన్‌

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సెక్టారు పరిధిలోకి వచ్చే భారత- పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట పొరుగు దేశం నుంచి జారవిడిచినట్టుగా భావిస్తున్న 7.25 కిలోల హెరాయిన్‌ను సరిహద్దు భద్రతాదళాలు (బీఎస్‌ఎఫ్‌) సీజ్‌ చేశాయి.

Published : 21 Jan 2022 06:14 IST

7.25 కిలోలు సీజ్‌ చేసిన బీఎస్‌ఎఫ్‌

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సెక్టారు పరిధిలోకి వచ్చే భారత- పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట పొరుగు దేశం నుంచి జారవిడిచినట్టుగా భావిస్తున్న 7.25 కిలోల హెరాయిన్‌ను సరిహద్దు భద్రతాదళాలు (బీఎస్‌ఎఫ్‌) సీజ్‌ చేశాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము దాకా సరిహద్దులో పెట్రోలింగ్‌ నిర్వహించిన దళాలకు ఏదో ఎగురుతూ వచ్చిన శబ్దం వినవచ్చినట్లు బీఎస్‌ఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. శబ్దం వచ్చిన దిశగా కాల్పులు జరపడమేకాక, కాంతులు వెదజల్లేలా బాంబులను పేల్చినట్లు వెల్లడించింది. తెల్లవారాక ఆ ప్రాంతం మొత్తం గాలించగా.. ఏడు ప్యాకెట్లలో మాదకద్రవ్యాలు దొరికాయని, దీనిపై విచారణ కొనసాగుతుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని