శరణార్థుల విషయంలో జాతీయ చట్టం రూపొందించాలి: ఎన్‌హెచ్‌ఆర్సీ

శరణార్థులు, దేశంలో ఆశ్రయం కోరే వారి విషయంలో ప్రస్తుతం ఉన్న అస్పష్టత నివారించటానికి ఓ జాతీయ చట్టం తేవాల్సిన అవసరం ఉందని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) గురువారం నిర్వహించిన

Published : 21 Jan 2022 06:14 IST

దిల్లీ: శరణార్థులు, దేశంలో ఆశ్రయం కోరే వారి విషయంలో ప్రస్తుతం ఉన్న అస్పష్టత నివారించటానికి ఓ జాతీయ చట్టం తేవాల్సిన అవసరం ఉందని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) గురువారం నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సులో అభిప్రాయపడింది. దీన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు జస్టిస్‌ ఎం.ఎం.కుమార్‌ ప్రారంభించారు. అంతర్జాతీయ శరణార్థులు, ఆశ్రయం కోరే వారి విషయంలో భారత్‌ రికార్డు అద్భుతంగా ఉందని సదస్సు ప్రశంసించింది. అయితే ఓ జాతీయ చట్టం రూపొందించాల్సిన అవసరాన్ని వక్తలు నొక్కి వక్కాణించారు. ఈ చట్టంలో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న మంచి విధానాలను చేర్చాలని, దీనికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఈ మేరకు సదస్సు అనంతరం ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ విశ్రాంత న్యాయమూర్తి అరుణ్‌కుమార్‌ మిశ్ర, ఇతర సీనియర్‌ సభ్యులు, న్యాయ, హోం, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని