
Published : 21 Jan 2022 06:14 IST
ఆన్లైన్లో విశ్వవిద్యాలయాల నకిలీ డిగ్రీలు
ముఠా గట్టురట్టు చేసిన పోలీసులు..ఇద్దరు అరెస్టు
ముంబయి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు పొందిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల నకిలీ డిగ్రీలను తయారు చేసి.. వాటిని ఆన్లైన్లో అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు ముంబయి నేరవిభాగ పోలీసులు. ఈ కేసులో గురువారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సోదాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, దిల్లీ, హిమాచల్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, చత్తీస్గఢ్లోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ డిగ్రీ ధ్రువపత్రాలను, మార్క్ షీట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tags :