తమిళనాట మాజీ మంత్రి ఆస్తులపై అనిశా దాడులు

తమిళనాడులో అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి కె.పి.అన్బళగన్‌కు సంబంధించిన ఆస్తులపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. పలు జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో 57 ప్రాంతాల్లో ఈ సోదాలు చేశారు.

Updated : 21 Jan 2022 06:20 IST

ట్రిప్లిక్లేన్‌,న్యూస్‌టుడే: తమిళనాడులో అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి కె.పి.అన్బళగన్‌కు సంబంధించిన ఆస్తులపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. పలు జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో 57 ప్రాంతాల్లో ఈ సోదాలు చేశారు. కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.11.32 కోట్ల వరకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రెండ్రోజులుగా గుట్టుగా జరుగుతున్న ఈ దాడుల నేపథ్యంలో మాజీ మంత్రి సహా ఆయన భార్య మల్లిక, కుమారులు శశిమోహన్‌, చంద్రమోహన్‌, కోడలు వైష్ణవిపై గురువారం కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని