స్టాలిన్‌ఫై 18 క్రిమినల్‌ కేసుల రద్దు

అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ఫై పెట్టిన 18 క్రిమినల్‌ కేసులను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం మద్రాసు హైకోర్టు ప్రకటించింది. అన్నాడీఎంకే పాలనలో పాలన, పథకాలు, టెండర్లు, వాకీటాకీ కొనుగోళ్లు

Published : 22 Jan 2022 05:18 IST

ట్రిప్లికేన్‌, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ఫై పెట్టిన 18 క్రిమినల్‌ కేసులను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం మద్రాసు హైకోర్టు ప్రకటించింది. అన్నాడీఎంకే పాలనలో పాలన, పథకాలు, టెండర్లు, వాకీటాకీ కొనుగోళ్లు, తదితరాలపై వ్యాఖ్యలు చేసిన స్టాలిన్‌పై... క్రిమినల్‌, పరువునష్టం సహా వివిధ నేరారోపణల కింద 18 కేసులు ప్రభుత్వం తరఫున నమోదయ్యాయి. వార్తల ప్రచురణకు సంబంధించి మురసొళి ఎడిటర్‌ సెల్వం, కలైజ్ఞర్‌ టీవీ ఎడిటర్‌ తిరుమావేలంఫై కూడా కేసులు పెట్టారు. కేసులను రద్దు చేయాలని కోరుతూ స్టాలిన్‌ఫై తరఫున గతంలో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. డీఎంకే అధికారంలోకి రాగానే కేసులను ఉపసంహరించుకొంటున్నట్లు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం ఆమోదించింది. స్టాలిన్‌పై ఉన్న కేసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని