
Published : 22 Jan 2022 05:18 IST
24 గంటల్లో 3.47 లక్షల కేసులు
దిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ఏకంగా 3,47,254 కొత్త కేసులు బయటపడగా.. 703 మరణాలు నమోదయ్యాయి. గత 235 రోజుల్లో ఎన్నడూలేనంత గరిష్ఠంగా.. క్రియాశీలక కేసుల సంఖ్య 20,18,825 (5.23%)కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కి పెరిగింది. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3,85,66,027కి చేరగా.. ఇంతవరకు 4,88,396 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక్కసారిగా 17.94%కి చేరింది.
Tags :