అధికారులపై చేయి చేసుకున్న కేంద్ర మంత్రి!

కేంద్ర గిరిజన సంక్షేమ, జలశక్తి శాఖల సహాయ మంత్రి బిశ్వేశ్వరటుడు శుక్రవారం ఇద్దరు అధికారులపై చేయి చేసుకున్నారు. ఒడిశాలోని మయూరభంజ్‌ జిల్లా ప్రణాళికా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారులు

Published : 22 Jan 2022 05:18 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: కేంద్ర గిరిజన సంక్షేమ, జలశక్తి శాఖల సహాయ మంత్రి బిశ్వేశ్వరటుడు శుక్రవారం ఇద్దరు అధికారులపై చేయి చేసుకున్నారు. ఒడిశాలోని మయూరభంజ్‌ జిల్లా ప్రణాళికా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారులు అశ్విని మల్లిక్‌, దేవాశిష్‌ మహాపాత్ర్‌లను కుర్చీతో కొట్టారు. బాధిత అధికారులు విలేకరులతో మాట్లాడుతూ.. సమీక్షా సమావేశానికి తన నివాసానికి రావాలని పిలిచిన టుడు దుర్భాషలాడి.. కుర్చీతో కొట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనను మయూర్‌భంజ్‌ జిల్లా అదనపు కలెక్టరు రుద్రనారాయణ మహంతి తప్పు పట్టారు, అధికారులపై చేయి చేసుకోవడం తగదన్నారు. మంత్రి టుడు ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని