
Updated : 22 Jan 2022 07:18 IST
CISF: విమాన ప్రయాణికులకు ఒకే హ్యాండ్‌బ్యాగ్‌కు అనుమతి
ఈనాడు, దిల్లీ: విమాన ప్రయాణికులకు ఇక మీదట కేవలం ఒకే హ్యాండ్‌బ్యాగ్‌ను అనుమతించాలని సీఐఎస్‌ఎఫ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడు సగటున 2- 3 హ్యాండ్‌బ్యాగ్‌లు తెస్తున్నందున వాటి తనిఖీకి సమయం తీసుకోవడంతో పాటు, తనిఖీ కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతోందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌కు సీఐఎస్‌ఎఫ్ లేఖ రాసింది. ‘‘ప్రయాణికులు స్క్రీనింగ్ పాయింట్ వద్దకు సగటున 2-3 బ్యాగులతో వస్తున్నారు. ఇది తనిఖీల సమయాన్ని, రద్దీని పెంచి అందరికీ అసౌకర్యంగా మారుతోంది. ఇకపై అన్ని ఎయిర్‌లైన్స్, ఎయిర్‌లైన్ నిర్వాహకులు ఒకే హ్యాండ్‌బ్యాగ్ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలి’’ అని సీఐఎస్‌ఎఫ్ లేఖలో పేర్కొంది.
Tags :