ఆకాశం నీ హద్దురా!: దేశాటనకు సకల సౌకర్యాలతో సైకిల్
దూర ప్రాంతాలు పర్యటించాలంటే అన్ని సౌకర్యాలతో కూడిన వాహనం కావాలి. ఇందుకు ఎక్కువ మొత్తం ఖర్చవుతుంది. చాలామంది ట్రావెలర్స్‌కు ఇది సాధ్యపడకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఓ విద్యార్థి సరికొత్త
దూర ప్రాంతాలు పర్యటించాలంటే అన్ని సౌకర్యాలతో కూడిన వాహనం కావాలి. ఇందుకు ఎక్కువ మొత్తం ఖర్చవుతుంది. చాలామంది ట్రావెలర్స్‌కు ఇది సాధ్యపడకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఓ విద్యార్థి సరికొత్త ఆలోచనతో తనే సొంతంగా ఓ వాహనాన్ని రూపొందించాడు. కేరళలోని కొజికోడ్ జిల్లా పదనిలమ్కు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆకాశ్ కృష్ణ తొలుత పాతసామాన్ల దుకాణం నుంచి తీసుకొచ్చిన సామగ్రితో గేర్ సైకిలు రూపొందించాడు. ఆ సైకిలుకు ఓ మోటారు బిగించాడు. తర్వాత ట్రావెలింగు కోసం సిద్ధం చేసిన క్యాంపర్ క్యాప్సుల్‌ను జత చేశాడు. పీవీసీ బోర్డులు, మెటల్ ఫ్రేములతో క్యాంపర్ వాహనం సిద్ధమైంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు సౌకర్యంగా నిద్రపోవచ్చు. అలాగే.. చిన్న ఫ్రిడ్జ్, ఇన్వర్టర్, వాటర్ కూలర్, టీవీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్, సెక్యూరిటీ అలారం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు కోసం క్యాంపింగ్ క్యాప్సుల్‌పై సోలార్ ప్యానల్స్ బిగించాడు. క్యాంపర్కు స్కూటర్ టైర్లు వినియోగించాడు. ఇందుకోసం రూ.65 వేలు ఖర్చు చేశానని.. ఈ క్యాంపర్ సాయంతో దేశవ్యాప్తంగా పర్యటించాలనేదే తన లక్ష్యమని ఆకాశ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్