
అనుచిత ఉచితాలను అడ్డుకోండి
సుప్రీంకోర్టులో పిటిషన్
దిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలుచేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అటువంటి రాజకీయ పక్షాల ఎన్నికల గుర్తును నిలిపివేయడం లేదా ఆ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఓటర్ల మన్నన పొందడం కోసం రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తూ అడ్డదారుల్లో అమలు చేస్తున్న ప్రజాకర్షక విధానాలను నిషేధించాలని కోరారు. ఓటర్లను మభ్యపెట్టి అనుచిత లబ్ధి పొంది తద్వారా అధికారంలో కొనసాగేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు ఎన్నికల పవిత్రతను కలుషితం చేస్తాయని, పోటీ చేసే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆదర్శానికి విఘాతం కలిగిస్తాయని పిటిషనర్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. సముచిత నివారణ చర్యలు తీసుకునేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)ను ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.