మహాత్ముడికి ఇష్టమైన కీర్తన తొలగింపు

గణతంత్ర వేడుకల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 29న ఏర్పాటు చేసే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ కార్యక్రమంలో మహాత్మా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ కీర్తన ‘అబైడ్‌ విత్‌ మీ’ని తొలగించారు. ఏటా ఈ గేయంతోనే వేడుక ముగిసేది.

Published : 23 Jan 2022 05:02 IST

దిల్లీ: గణతంత్ర వేడుకల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 29న ఏర్పాటు చేసే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ కార్యక్రమంలో మహాత్మా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ కీర్తన ‘అబైడ్‌ విత్‌ మీ’ని తొలగించారు. ఏటా ఈ గేయంతోనే వేడుక ముగిసేది. ఈసారి మాత్రం ‘సారే జహా సే అచ్చా’తో కార్యక్రమం సమాప్తమవుతుంది. ‘అబైడ్‌ విత్‌ మీ’ని స్కాటిష్‌ ఆంగ్లికన్‌ కవి హెన్రీ ఫ్రాన్సిస్‌ లైట్‌ 1847లో రచించారు. 1950 నుంచి ఈ కీర్తన బీటింగ్‌ రిట్రీట్‌లో భాగంగా ఉంటోంది. దీన్ని తొలగించడంపై కాంగ్రెస్‌ మండిపడింది. గాంధీ సిద్ధాంతాలకు, ఆయనను హత్య చేసిన గాడ్సే ఆలోచనలకు మధ్య నేడు సైద్ధాంతిక యుద్ధం జరుగుతోందని విమర్శించింది. గాడ్సేపై భాజపాకున్న ప్రేమను ఇది చాటుతోందని ఆరోపించింది. అమర్‌జవాన్‌ జ్యోతిని, ‘అబైడ్‌ విడ్‌ మీ’ గేయాన్ని తొలగించడాన్ని శివసేన తప్పుబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని