పోలీస్‌ కాల్పుల్లో మాజీ విద్యార్థినేతకు గాయాలు

అస్సాం పోలీసుల కాల్పుల్లో మాజీ విద్యార్థినేత కీర్తి కమాల్‌ బోరా గాయపడగా, ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలంటూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. శనివారం జరిగిన ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరారు.

Published : 24 Jan 2022 05:01 IST

విపక్షాల గగ్గోలు.. విచారణకు ఆదేశించిన అస్సాం సీఎం

గువాహటి: అస్సాం పోలీసుల కాల్పుల్లో మాజీ విద్యార్థినేత కీర్తి కమాల్‌ బోరా గాయపడగా, ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలంటూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. శనివారం జరిగిన ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరారు. నగావ్‌ జిల్లాలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్టుగా చెబుతున్న బోరా తనిఖీల్లో తమపై కాల్పులు జరపగా, తాము ఎదురుకాల్పులు జరిపినట్లు ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. పోలీసుల వాదన అబద్ధమని ఖండించిన కీర్తి కమాల్‌ బోరా కుటుంబికులు, ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు 1990ల నాటి ‘రహస్య హత్యలు’ కంటే దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బోరాకు గువాహటి వైద్య కళశాలలో చికిత్స అందిస్తున్నారు. ఈయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, గతేడాది మేలో రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్లపై రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని గువాహటి హైకోర్టు జనవరి 11న అస్సాం సర్కారును ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని