నాడు తండ్రిది.. నేడు కుమారుడిది

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటన్‌ పాలకులను గడగడలాడించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. ఇప్పుడు వారి విగ్రహాలనూ వదలిపెట్టడం లేదు. ఆదివారం నరేంద్ర మోదీ ఇండియా గేట్‌ దగ్గర.. గతంలో ఐదో కింగ్‌ జార్జ్‌ విగ్రహం ఉన్న కనోపీ (మండపం)లో నేతాజీ

Published : 24 Jan 2022 05:01 IST

రెండు విగ్రహాల స్థానాల్లోనూ నేతాజీయే

దిల్లీ: ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటన్‌ పాలకులను గడగడలాడించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. ఇప్పుడు వారి విగ్రహాలనూ వదలిపెట్టడం లేదు. ఆదివారం నరేంద్ర మోదీ ఇండియా గేట్‌ దగ్గర.. గతంలో ఐదో కింగ్‌ జార్జ్‌ విగ్రహం ఉన్న కనోపీ (మండపం)లో నేతాజీ హాలోగ్రామ్‌ ప్రతిమను ఆవిష్కరించారు. కింగ్‌ జార్జి తండ్రి విగ్రహం విషయంలోనూ ఇలానే జరిగింది. దిల్లీ దర్బార్‌ కోసం 1911లో భారత్‌కు వచ్చిన ఐదో కింగ్‌ జార్జ్‌.. తన తండ్రి ఏడో ఎడ్వర్డ్‌ ప్రతిమకు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం 1922లో పూర్తయింది. ఈ ప్రదేశాన్ని ఎడ్వర్డ్‌ పార్క్‌ అని పిలిచేవారు. అయితే 1970ల్లో ఆ విగ్రహాన్ని తొలగించి.. బోస్‌, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వీరుల ప్రతిమలను నాటి ప్రభుత్వం నెలకొల్పింది. పేరు కూడా సుభాష్‌ పార్క్‌గా మార్చేసింది. ఎడ్వర్డ్‌ విగ్రహాన్ని టొరంటోకు పంపించేసింది. అలా.. నాడు తండ్రి, నేడు కుమారుడి విగ్రహాలు నేతాజీకి చోటిచ్చి తప్పుకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని