ఇంకేం స్పష్టత కావాలి.. అంతా ఉత్తర్వుల్లోనే ఉంది

షహీన్‌బాగ్‌ ధర్నాపై 2020 అక్టోబర్‌ 7న వెలువడిన తీర్పుపై మరింత స్పష్టతివ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. నాటి తీర్పులో బహిరంగ ప్రదేశాలను ఆందోళనకారులు నిరవధికంగా కబ్జా చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో

Published : 25 Jan 2022 04:33 IST

2020 షహీన్‌బాగ్‌ ధర్నా తీర్పుపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: షహీన్‌బాగ్‌ ధర్నాపై 2020 అక్టోబర్‌ 7న వెలువడిన తీర్పుపై మరింత స్పష్టతివ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. నాటి తీర్పులో బహిరంగ ప్రదేశాలను ఆందోళనకారులు నిరవధికంగా కబ్జా చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి, ఆందోళన వ్యక్తం చేసే హక్కు ఉందని, అయితే నిర్దేశిత ప్రాంతాల్లోనే నిరసనలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిపై మరింత స్పష్టతనివ్వాలని సయ్యద్‌ బహాదూర్‌ అబ్బాస్‌ నక్వీ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఆ సమస్య ముగిసిపోయింది. ఎందుకు ఈ పిటిషన్‌ లిస్టయింది? ఇంకేం స్పష్టత కావాలి..? నాకైతే అర్థం కావడం లేదు. తీర్పులోనే అంతా ఉంది. ఎలాంటి స్పష్టత అవసరం లేదు. కొట్టివేస్తున్నాం’’ అని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ ప్రకటించారు. 2020 తీర్పును కూడా జస్టిస్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనమే వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని